*

 

ఇటీవల ముంబైలో మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతోంది. అతని ఆకస్మిక మరణం ప్రపంచం మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. అంతకంటే ముందు దిగ్బ్రాంతిని కలిగించింది.

అతని మరణం వెనుక ఉన్న కారణం తెలియక గత ఆరునెలలుగా మనసున్న ఎందరో తమ తమ రోజువారీ జీవితాలను, తమ స్వంత పోరాటాలను పక్కన పెట్టి ఈ ఒక్క అంశాన్ని గురించే మాట్లాడుతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు.

ఈ సుశాంత్ ఎవరు? భారతదేశంలో బీహార్ రాష్ట్రంలోని పట్నాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అబ్బాయి. స్కూల్ చదువులో పెద్దగా ప్రతిభను కనబరచకపోయినా తెలివైన పిల్లవాడిగా, సైన్స్ పట్ల అపారమైన ఆసక్తి కలిగిన వాడిగా పెరిగాడు. పుస్తకాలను విపరీతంగా చదివేవాడు. నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ లో మంచి ర్యాంక్ ను గెలుచుకుని దిల్లీలో ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ తెచ్చుకున్నాడు. చదువుకుంటూనే డాన్స్ పట్ల ఇష్టంతో డాన్స్ క్లాసుల్లో చేరాడు. అతని ప్రతిభ అతనిని థియేటర్ వైపు నడిపించింది. అక్కడినుంచి టి.వి. సీరియల్స్, ఆ తర్వాత హిందీ సినిమాలు. ఎక్కడా ఎలాటి షార్ట్ కట్స్ లేవు. ఎలాటి గాడ్ ఫాదర్ లేడు. అయినా విజయం తరువాత విజయం వైపుగా ఎదుగుతూనే ఉన్నాడు మొన్నమొన్నటిదాకా. అతని వ్యక్తిత్వం, దాతృత్వం అతని విజయాలకంటే గొప్పవని అతని చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తించింది.

 

*

 

తను ఎక్కని మెట్లు లేవు. ఏరంగంలోకి అడుగుపెట్టినా అక్కడ తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తూ యువతకు ఒక మోడల్ గా నిలిచాడు. నలుగురు అక్కల మధ్య పెరిగినందువల్లనేమో ఆడపిల్లలు స్వీయ రక్షణను నేర్చుకోవాలని, స్త్రీలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగాలని కోరుకుంటూ, తనవంతు కృషి చేసాడు. ఇంతలో ఏమైంది?
అసలు ఇతని గురించి మనం ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నాం? మనమంతా కలలు కంటాం. కలలు కనే హక్కు అందరికీ ఉంది. ఇతను అందరిలాగే కలలు కన్నాడు. ఎన్నెన్నో కలలు. తను నెరవేర్చుకోవలసిన ప్రతి కల గురించీ డైరీలో రాసిపెట్టుకునేవాడు. తను కన్న యాభై కలలలో కేవలం పన్నెండు మాత్రమే నెరవేర్చుకోగలిగాడు. ఇది అతని మరణం తరువాత తెలిసిన వాస్తవం. కలలు కనే అర్హత, అవకాశం అసలు మధ్యతరగతివారికే ఉందేమో అనిపిస్తుంది. ఆర్థికంగా పై స్థాయిలో ఉన్నవారికి అన్నీ అందుబాటులోనే ఉంటాయి. కలలు కనేందుకు ఏమీ మిగలదు. ఆర్థికంగా కింది స్థితిలో ఉన్నవారికి రోజూవారీ జీవితాలే పెద్ద సవాళ్లు. కలలు కనే తీరిక, ఆసక్తి ఉండవు.

ఇన్నికలలు కని, జీవితం పట్ల ఇన్ని ఆశలున్న ఈ ముప్ఫై నాలుగేళ్ల అబ్బాయి అంతలోనే ఎక్కడికెళ్లిపోయాడు? స్వయం కృషితో సాధించిన విజయాలమధ్య, ఇంకా సాధించ వలసిన ఎన్నో విజయాల మధ్య అర్థాంతరంగా మనమధ్య నుంచి ఎలా మాయమైపోయాడు? ఇదే ఇప్పుడు మనందరినీ వేధిస్తున్న ప్రశ్న. సమాధానం కోసం మనని నిలవనీయక ఎక్కడెక్కడో ఉన్న మనందరినీ ఒక్కచోటకి చేర్చిన విషయం ఇదే.

 

*

 

ఈ సంఘటన మనలో కలలు కనాలన్న ఆలోచనను కూడా మరిచిపోయేలా చేస్తుందేమో?! జీవితం పట్ల ఎన్నో కలలతో ఎదుగుతున్న ఎందరినో నిరాశలో ముంచేస్తుందేమో? అదే జరిగితే మన సమాజం ఏమైపోతుంది?

మన మీద చుట్టూ ఉన్న సమాజం చూబించే ప్రభావం ఎంతో ఉంటుంది. మన వ్యక్తిత్వాలను అది రూపుదిద్దుతుంది. మంచి చెడులను నేర్పుతుంది.
ఎలాటి భవిష్యత్తు ఆశలూ లేని యువతను ఊహించలేము. అలాటి ప్రపంచం నడక మరిచిపోతుంది. స్తభించిపోతుంది. దానికి మనం సిద్ధంగా లేము. అందుకే మన భవిష్యత్ తరాలకోసం, వాళ్లు కనే బంగారు కలలు నిజమవుతాయన్న ధైర్యాన్నిచ్చేందుకే మనం ఈ పోరాటాన్ని చేస్తున్నాం. మనకి న్యాయం కావాలి.

మరొక సుశాంత్ సింగ్ రాజపుట్ ని మనం ఊహించలేము. మనమంతా సమైక్యంగా నిలబడి న్యాయం కోసం, కలలు కనే యువతకోసం బంగారు బాటను పరుద్దాం.

 

*

 

Telugu Essay Credit: Nadella Anuradha Of https://dwaitaadwaitam.wordpress.com/

 

* * *

About The Author: 

నా పిల్లలకి అ, ఆ లు నేర్పే క్రమంలో ఆ అక్షరాలతో వాళ్ల అందమైన ప్రయోగాలు నన్ను బోధన వైపు లాక్కెళ్లాయి. నా భవిష్యత్తు ఇంత అందంగా వాళ్లే రాసేరనిపిస్తుంది. వాళ్లకేమివ్వగలను? నేను నేనుగా మిగిలే ప్రయత్నంలో సహచరుడి చిరునవ్వూ తోడుంది.

ఇంతకీ …………….ఇదీ నేను.

Nadella Anuradha

The Fight For Justice

 

Capturing the radiant essence of Sushant Singh Rajput, his towering legacy, and our unbreakable connection with him in a few words is difficult. But, in our pursuit of justice for his brilliant soul, we are already redefining what’s possible.

After all, our “Dear Photon” was that bundle of energy who showed us how to contemplate deeply, seek change and inspire action in others.

He was on his way to sending 100 kids for workshops in ISRO/NASA (Dream 13/50), was helping train more and more women in self-defense (Dream 33/50), and was pursuing his passion to be an ambidextrous archer (Dream 37/50).

There was so much more he was aspiring for our future and actively working towards until the day he was murdered.

Join us as we shatter past narratives and move towards a collective future that our Sushant had dreamt for us. We’re all living our lives now, but isn’t it time we live our dreams?!

If you’re like us, we need your help to make the resounding roar of justice louder! Words are encouraging, but actions are empowering! Are you with us?

 

 

 

 

Follow Along The Journey Of Global SSR Fans

Questions, just ask!

Text or Call: 678.310.5025 | Email: info@futurestrongacademy.com

Bringing a Group? Email us for a special price!

%d bloggers like this: