678.310.5025

* * *

 

The original English version: Dear Refugee, my life must go on.. 

This poem appeared originally in The Saaranga Magazine HERE

 

*

 

నన్నల్లుకున్న వెచ్చని కార్డిగన్,
మెత్తని నా అరచేతుల మధ్య పొగలు కక్కేలికరస్టీ………..
పౌర హక్కుల్ని పగటికలలుగా కనేందుకు
నేపథ్యం సహజంగా లేదూ?
 
నువ్వూ, నేనూ పంచుకున్న ఆకాశం కప్పు క్రింద,
నా గది కిటికీ లో నీ వైపు నుంచి తళుక్కుమంటూ నడిచొస్తున్న నక్షత్రాలు!  
కానీ, దైన్యంతో అలసిన నీ ముఖంలోని కన్నీరు మాత్రం
నేల మీద అగోచరంగానే ఉంది.
 
తల మీద కప్పుకోసం నువ్వు పేర్చుకుంటున్న క్షణకాలపు ఏర్పాట్లలోనే
నీ జీవితపు చిత్రాలు సాక్షాత్కరిస్తున్నాయి.
అవునూ, అందరికీ ఇంద్రధనస్సుల్ని పట్టుకొచ్చే వాన చినుకులు
నీకు మాత్రం దుఃఖాన్నెందుకిస్తున్నాయి?
 
ఇక్కడ, నా ఇంటి సింక్ లో స్వచ్ఛమైన నీటి ప్రవాహం మధ్య
గులాబీలను శుభ్ర పరుస్తున్నాను, ముళ్లని జాగ్రత్తగా తప్పించి మరీ….
అక్కడనువ్వు దాటుతున్న భౌగోళిక సరిహద్దు ఇనుపకంచై
నిలువునా చీర్చి, నీ శరీరం మీద ఎర్రెర్రని గులాబీల్ని ముద్రిస్తోంది!
 
ఇక్కడ, నా పెరట్లో జారుడుబల్లలు నిశ్శబ్ద గీతాల్ని ఆలాపిస్తున్నాయి,
పసితనం వదిలి నా పిల్లలు పెద్దరికాన్ని తొడుక్కుంటున్నారు!
అక్కడ, మెర్రీ గోరౌండ్ చుట్టూ కేరింతలైన బాల్యం
అదాటున వచ్చిన యుధ్ధం తాకిడికి చెల్లాచెదరై దుమ్ముగొట్టుకుని గుట్టలై పడుంది.
 
రాజకీయాలొద్దులే, వాటిని ప్రక్కన పెడదాం.
నేనిక్కడ ఇలా ఉన్నందుకు సదా కృతజ్ఞురాల్ని!
కానీ, నువ్వింకా అక్కడే ఉన్నావన్న వాస్తవం
నన్ను అపరాధిని చేస్తోంది!
 
ఆకాశం క్రింద ఆచ్ఛాదన కోసం,
నీ కుటుంబానికి పూట కడుపు నింపటం కోసం అన్వేషిస్తుంటావ్!
నేను మాత్రం, విలాసంగా
గాక్ మోలేలో అందమైన రూపులు తొడుక్కున్న చిప్స్ ని నంజుకుంటున్నాను!
 
ఏదీ, రాత్రి కాస్త కనురెప్పలు మూత పడేందుకు
రెండు మాత్రల సాయం తీసుకుంటాను.
చెవులు దద్దరిల్లిన యుధ్ధ విమానాల మ్రోతతో రాత్రిని నిద్ర పుచ్చిన నువ్వు,
తెలవారి ఇంకా బ్రతికే ఉన్నందుకు విస్తుబోతావ్!
 
రేపు నేను తీరిగ్గా సముద్రంలో
చేపలు పట్టేందుకు వెళ్తానేమో.
అర్థ రాత్రో సరిహద్దు దాటే నిన్ను
ఉప్పు నీటి ప్రవాహాలు అమాంతం మింగేస్తాయేమో!
 
తల దాచుకునే నీడ కోసం
ప్రపంచం చివరికంటా వెదుకులాడే నువ్వు
ఎంత తీరిక లేకుండా ఉన్నావో!
చిత్రంగా, నేనూ అంతే తీరిక లేకుండా ఉన్నాను తెలుసా?
 
నువ్వెక్కడికి?’
అన్న నీ ప్రశ్నకి
జవాబిచ్చే సమయం నాకు లేదు, నిజం!
జీవిత చక్రం ఆగాలి కదా ముందు!
 
అప్పుడప్పుడు నన్ను ఒంటరితనం కమ్ముకున్నప్పుడు,
దేవుణ్ణి వెదికేందుకు క్షణం విరామం తీసుకుంటాను.
సముద్రానికావల ఉన్న నిన్ను ప్రేమిస్తున్నానని
మరికాస్త బిగ్గరగా చెప్పాలనుకుంటాను!
 
నీలాగే దిగులు పడుతుంటాను,
పిల్లల కోసం….
అయితే, స్వేచ్ఛా విహంగాలై,
హద్దులెరుగక పరుగెడుతున్న వారికోసం సుమా!
 
సమాజం పిలుస్తోంది,
నీ హక్కులకోసం తనతో కలిసి పోరాడేందుకు రమ్మని!
ఉష్ముందు నా ఇల్లు చక్కబెట్టాలి కదాఅంటూ జోకొడుతున్నాను.  
ఎవరు కాదనలేనిది కదూ అస్త్రం?
 
తెలుసు, ప్రశాంతంగా బ్రతికేందుకు
నువ్వు పడే యాతన,
నీ పట్ల నాకు ప్రేమ లేకపోలేదు.
అవును, అపరిచితుల్ని ఎవరినైనా నేను అచ్చం ఒక్కలాగే ప్రేమిస్తాను!
 
మనం స్నేహితులమన్న నీ అభిప్రాయాన్ని నీరుకార్చనీ,
నా గుమ్మంలో కొచ్చిన నీ ముందు
నేను ఏనాడూ నీ హక్కుల కోసం
పోరాడనేలేదన్నట్టు నటిస్తాను.
 
ఎందుకో తెలుసా?
నేను నేనే!
నాకు అంతా నేనే!
నీలాటి వేలాది మంది నాకేమీ కారు కనుక!
 

*

 

Original Poem Translated By: Nadella Anuradha

 

* * *

About The Author: 

నా పిల్లలకి అ, ఆ లు నేర్పే క్రమంలో ఆ అక్షరాలతో వాళ్ల అందమైన ప్రయోగాలు నన్ను బోధన వైపు లాక్కెళ్లాయి. నా భవిష్యత్తు ఇంత అందంగా వాళ్లే రాసేరనిపిస్తుంది. వాళ్లకేమివ్వగలను? నేను నేనుగా మిగిలే ప్రయత్నంలో సహచరుడి చిరునవ్వూ తోడుంది.

ఇంతకీ …………….ఇదీ నేను.

Nadella Anuradha

Poetry

I’m Mortal – A Poem

I’m Mortal – A Poem

*   The embers remind me of my body,These logs with their withered skin,Are turning into ash as I watch. The same crackling noisesThat my fat will make,When I will burn along the Ganga. Most people want to live a 100 yearsYet, not know what to do on a lazy Sunday...

read more
My India By Swami Paramahamsa Yogananda

My India By Swami Paramahamsa Yogananda

*   Not where the musk of happiness blows,Not where darkness and fears never tread;Not in the homes of perpetual smiles,Nor in the heaven of a land of prosperityWould I be bornIf I must put on mortal garb once more.   Dread famine may prowl and tear my...

read more
Love Made Me Do It

Love Made Me Do It

*   As you slip and fall, my thoughts are along with you atop the death train – la bestia. A smiling young man you were, one second ago,the next – a limp body in the overgrown unworn path.A heatstroke at 16 has sent you home sooner than you wished for. But is any...

read more
YDDO – You Don’t Die Once; A Poem On Redemption

YDDO – You Don’t Die Once; A Poem On Redemption

* YDDO – You Don’t Die Once A Poem On Redemption   Unless you're a mid-lifer like me,This poem ain't gonna hold your attention.   Now let's begin.Yes, it is possible. Yes, I said it's possible to press resetMany times over.   Seek your truth every new...

read more
Many Predicaments In Life. Writing Poetry Cannot Be One.

Many Predicaments In Life. Writing Poetry Cannot Be One.

Poetry   “How do one see the big picture and hold the world’s pain, and at the same time see all of the bright edges of joy? I think that’s at the center of my question.”~ Poet Ada Limón  Questions, just ask! Text or Call: 678.310.5025 | Contact: Fill Form...

read more
In the Age of Dank Memes, Why Read Poetry?

In the Age of Dank Memes, Why Read Poetry?

* Just A String Of Words?   A good poem demands the dignity to be understood. History repeats in its resounding words. Repetition is a poem's strongest flavors. Poems are words with life because they're current and most urgent with their message to humanity. Yet,...

read more

Questions, just ask!

Text or Call: 678.310.5025 | Contact: Fill Form

Bringing a Group? Email us for a special price!

Discover more from FutureSTRONG Academy

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading